– సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఏజే రమేశ్
బూర్గంపహాడ్, ఆగస్టు 01 : బూర్గంపహాడ్ మండలంలో ఈ నెల 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుci ఏజే రమేశ్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని సారపాక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ 29 కార్మిక చట్టాలను మార్చి కార్మికులను బలిపశువులను చేస్తుందని ఆరోపించారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మోదీ ప్రభుత్వం 12 గంటలకు తెచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
జైల్బరో చేపట్టి కార్మికులు మోదీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నల్ల చట్టాలను తీసుకువచ్చి మోదీ ప్రభుత్వం రైతాంగానికి అన్యాయం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సంఘ మండల అధ్యక్షురాలు ఎస్ కె. అబీద, సీఐటీయూ నాయకులు కనకం వెంకటేశ్వర్లు, పాషా, బత్తుల గోపాలరావు, నర్సింహారావు, ధర్మ, కన్నయ్య, మర్రి వెంకటరెడ్డి, సుధాకర్, శివ, పదులు పాల్గొన్నారు.