Shimla | షిమ్లాకు పోటెత్తిన వాహనాలు.. ఒక్కరోజే 16,000 వాహనాల ఎంట్రీ.. భారీ ట్రాఫిక్ జామ్
Shimla : హిల్ స్టేషన్‌గా, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా పేరుపొందిన షిమ్లాకు శనివారం భారీగా వాహనాలు పోటెత్తాయి. ఒక్కరోజే ఏకంగా 16,000కుపైగా వాహనాలు షిమ్లాలోకి ప్రవేశించినట్లు అక్కడి ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
Shimla : హిల్ స్టేషన్‌గా, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా పేరుపొందిన షిమ్లాకు శనివారం భారీగా వాహనాలు పోటెత్తాయి. ఒక్కరోజే ఏకంగా 16,000కుపైగా వాహనాలు షిమ్లాలోకి ప్రవేశించినట్లు అక్కడి ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాకు పర్యాటకులు నిరంతరం వస్తూ ఉంటారు.
అందులోనూ వీకెండ్ కావడంతో భారీగా జనాలు వాహనాలతో షిమ్లా చేరుకున్నారని అధికారులు అంటున్నారు. 15-20 నిమిషాలు పట్టే దూరానికి ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల నుంచే కాకుండా ఉత్తరాఖండ్, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలైన షిమ్లాతోపాటు కులు-మనాలి, షిమ్లా, నైనిటాల్, భిమ్టాల్, కైంచి ధామ్‌లకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. రోహ్తక్లో మంచు కురవడం, లాహల్-స్పితి ప్రాంతంలో శీతల వాతావరణం ఉండటంతో ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తున్నారు.
ఈ రోడ్డు మార్గం మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి, హిడింబా దేవి ఆలయాన్ని కలుపుతుంది. సాధారణంగా రోజుకు పదివేల వాహనాలు వస్తుంటాయని, కానీ, ఈ రోజు 16,000కుపైగా వాహనాలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో పావుగంట పట్టే ప్రయాణం ఇప్పుడు గంట నుంచి రెండు గంటలు పడుతుందని చెప్పారు. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాహనాలు ఏ అవాంతరం లేకుండా కదిలేలా ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- long weekend
- Manali
- Shimla
- traffic
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

