Revanth Family : ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబం బినామీల పేరుతో భారీగా కుంభకోణాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మెడికవర్ ఆసుపత్రులు.. మాక్స్ బీఎన్ ఫార్మా.. తాజాగా కూతురు నైమిషా రెడ్డి పేరిట ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ స్కాంలో భాగమనే వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ కుటుంబం అక్రమాలను తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. దుంప శిరీష పేరుతో రూ. కోట్ల బినామీ ఆస్తులు, కూతురు, అల్లుడు, సోదరులు, భార్య పేరిట వ్యాపారాలు, బినామీల పేరిట రూ. కోట్లల్లో స్కాంలు అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంకుంభకోణాల చిట్టా ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. బినామీల పేరుతో ఆస్తులు, వ్యాపారాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికవర్ ఆసుపత్రిలో దుంప శిరీష పేరిట బినామీ పెట్టుబడులు.. రూ. 13,200 కోట్లకు అమ్మకం, మాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీల ప్రధాన డైరెక్టర్లుగా రేవంత్ అల్లుడు సత్యనారాయణ, దుంప శిరీష ఉండడం.. సహృదయ మాతృ సంస్థ ద్వారా మెడికవర్ నిర్మాణం.. రెండేళ్లలో 689 శాతం పెరిగిన సంస్థ ఆదాయం ఇందుకు మచ్చుతునక.
అంతేకాదు రెండేళ్లలోనే మెడికవర్ ఆసుపత్రులు రూ. 13,200 కోట్లకు అమ్ముడుపోవడం కూడా రేవంత్ కుటుంబం కుంభకోణంలో భాగమేననే అరోపణలు వస్తున్నాయి. 2024లో హ్యుండాయ్ వాళ్లను కలిసిన రేవంత్.. తన భార్య గీత పేరుతో ఆ తర్వాత గీతా ఆటోమోటివ్స్ 5 షోరూమ్లు ప్రారంభించారు. తాజాగా రేవంత్ కూతురు నైమిష రెడ్డి కొంపల్లిలో ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణానికి ఇప్పటికే అన్ని అనుమతులు జారీ అయ్యాయి. ఆ ఆ స్కూల్లో డైరెక్టర్లుగా దుంప శిరీష, రేవంత్ కూతురు నైమిష రెడ్డిలు ఉన్నారు. ఇవి చాలదన్నట్టు మెడికవర్, మాక్స్ బీఎన్ ఫార్మా, నైమిష స్కూళ్లు, మైండ్ వాల్ కన్స్ట్రక్షన్స్లో దుంప శిరీష భాగస్వామి. దాంతో.. రేవంత్ కుటుంబం రూ. 50 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
బినామీలతో రేవంత్ ఫ్యామిలీ రూ. 50,000 కోట్ల స్కాం
మెడికవర్ ఆసుపత్రులు.. మాక్స్ బీఎన్ ఫార్మా.. తాజాగా కూతురు పేరిట ఇంటర్నేషనల్ స్కూల్
తవ్వేకొద్దీ బయటపడుతున్న విస్తుపోయే నిజాలు.. దుంప శిరీష పేరుతో రూ. కోట్ల బినామీ ఆస్తులు
కూతురు, అల్లుడు, సోదరులు, భార్య పేరిట వ్యాపారాలు, బినామీల… https://t.co/gs75kvXp4q pic.twitter.com/6xD1unE2NV
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2026