Fire Acciident | జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం కారణంగా భారీ ఎత్తు మంటలు ఎగిసిపడుతుండటంతో దుకాణం కాలిబూడిదైంది.
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మెయిన్ రోడ్డు కావడంతో అగ్నిప్రమాదం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం
మెట్రోస్టేషన్ సమీపంలోని మంగళ గౌరి బట్టల షాపులో భారీగా ఎగిసిపడుతున్న మంటలు pic.twitter.com/hF7ISIwp96
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026
మంటలు ఆర్పుతున్న సిబ్బంది..
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్‌లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం