ముంబై: ఒక ఆర్మీ అధికారి మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. తాగిన మత్తులో సుమారు 30 మందిని కారుతో ఢీకొట్టాడు. (Drunk Army Officer Hits People) అదుపుతప్పిన ఆ కారు డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ ఆర్మీ అధికారిని చుట్టుముట్టి కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల హర్ష్‌పాల్ మహాదేవ్ వాగ్మారే ఆర్మీ అధికారి. అస్సాంలో విధులు నిర్వహిస్తున్న ఆయన నాలుగు రోజులు సెలవుపై మహారాష్ట్రకు వచ్చాడు.
కాగా, ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆర్మీ అధికారి హర్ష్‌పాల్ మహాదేవ్ నాగ్‌పూర్‌లోని నాగర్ధాన్లోని దుర్గా చౌక్ మీదుగా హమ్లాపురికి కారులో వెళ్తున్నాడు. అయితే మద్యం సేవించిన ఆయన కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో సుమారు 30 మందిని ఢీకొట్టాడు. ఆ తర్వాత డ్రైనేజీలోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది.
మరోవైపు ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహించారు. మద్యం సేవించి ఉన్న ఆర్మీ అధికారి హర్ష్‌పాల్ మహాదేవ్‌ను కారు నుంచి బయటకు లాగారు. గాయపడిన ఆయనపై దాడి చేశారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఆర్మీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Drunk Army Office allegedly hits 25-30 people with car in Maharashtra’s Nagpur
A 40-year-old army officer allegedly under the influence of alcohol rammed his car into a crowd, injuring around 25 to 30 people. The officer was on a four-day leave from Assam. pic.twitter.com/fR1eT3y1fb— Priyanka Koul (@Priyankakaul13) August 4, 2025
Also Read:
Watch: అదనపు లగేజీపై వివాదం.. స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి దాడి
Teen Jumps From Hill | తల్లి మొబైల్ ఫోన్ కొనడంలేదని.. కొండ పైనుంచి దూకి యువకుడు మృతి
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ