Arjun Sania Wedding | కొడుకు పెళ్లి వేడుకలో ఎమోషనల్ అయిన సచిన్ టెండూల్కర్.. వీడియో
ArjunTendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ - సానియా చందోక్లు త్వరలోనే వివాహాం చేసుకోబోతున్నారు.
Arjun Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ – సానియా చందోక్లు త్వరలోనే వివాహాం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కుటుంబం జామ్‌నగర్ ప్రీ వెడ్డింగ్ ఏర్పాటు చేయగా.. ఈ వేడుకల్లో సచిన్ టెండూల్కర్ తన కొడుకు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఒక అబ్బాయి తన జీవిత భాగస్వామిని ఇంటికి పరిచయం చేసినప్పుడే ఆ తండ్రికి తన కొడుకు పెద్దవాడయ్యాడని అర్థమవుతుందని, అర్జున్ తనకు నచ్చిన తోడును ఎంచుకున్నందుకు ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులైన అంబానీలు ఈ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహించడం పట్ల సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.
మార్చి 5, 2026న ముంబైలో వీరి వివాహం జరగనుండగా.. వధువు సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘాయ్ మనవరాలు. ఆమె స్వతహాగా ఒక ఎంట్రప్రెన్యూర్ కూడా. గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విపక్షనేత రాహుల్ గాంధీ వంటి హేమాహేమీలను సచిన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న అర్జున్, తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతుండటంతో క్రీడా మరియు వ్యాపార రంగ ప్రముఖులు ఈ వేడుకకు తరలిరానున్నారు.
Mrs Nita Ambani hosted the Tendulkar family and congratulated Arjun Tendulkar and Saaniya Chandhok on their upcoming wedding 🎉💐 pic.twitter.com/cTvla15eUa
— Reliance Industries Limited (@RIL_Updates) February 26, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

