భోపాల్: మతం మారి ముస్లిం వ్యక్తిని పెళ్లాడేందుకు ఒక మహిళ నిరాకరించింది. దీంతో కొంతకాలంగా హింసిస్తున్న అతడు దారుణానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ఇంట్లోకి చొరబడి గొంతుకోసి ఆమెను హత్య చేశాడు. (Man Slits Woman’s Throat) ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవారా గ్రామానికి చెందిన 35 ఏళ్ల భాగ్యశ్రీ నామ్‌దేవ్ ధనుక్‌ను 42 ఏళ్ల షేక్ రయీస్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. మతం మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. భాగ్యశ్రీ నిరాకరించడంతో పలుమార్లు జట్టుపట్టుకుని కొట్టి హింసించాడు.
కాగా, ఆగస్ట్ 1న భాగ్యశ్రీ ఇంట్లోకి షేక్ రయీస్ ప్రవేశించాడు. ఆమెను కొట్టడంతోపాటు కత్తితో గొంతుకోశాడు. పలుసార్లు పొడిచాడు. దీంతో భాగ్యశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. ఈ నేపథ్యంలో నిందితుడు షేక్ రయూస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యతోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. లవ్‌జిహాద్ ఘటనగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల కిందట బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ అదుపులోకి తీసుకున్న నిందితుడ్ని పోలీసులు విడుదల చేశారని ఆరోపించారు. అతడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
Also Read:
Drunk Army Officer Hits People | తాగిన మత్తులో.. 30 మందిని కారుతో ఢీకొట్టిన ఆర్మీ అధికారి
Teen Jumps From Hill | తల్లి మొబైల్ ఫోన్ కొనడంలేదని.. కొండ పైనుంచి దూకి యువకుడు మృతి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?