గద్వాల, ఫిబ్రవరి 23 : పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అయితే ప్రస్తుతం ఈ పంటలు చే తికి వచ్చేవరకు జూరాల నీరు సరిపోతుందా? లేదా? అనే దానిపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టుల గేట్ల ద్వారా లీకేజీల సమస్య వేధిస్తుంది. దీంతో ఈ ప్రభావం జూరాల ఆయకట్టుపై పడే ప్రమాదం ఉన్నది. జూరాల ప్రాజెక్టుపైనే జూరాల ఆయకట్టుతోపాటు నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. జూరాలలో రోజురోజుకు నీరు ఇంకి పోతుండడంతో రైతులు సాగు చేసిన పంటలకు చివరి వరకు నీరు పారుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోతే రైతుల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అ య్యే అవకాశం ఉన్నది. గత యాసంగి సీజన్లో రైతులు జూరాల కింద వివిధ పంట లు సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చే సమయంలో నీరు చివరి ఆయకట్టు వరకు పారక పోవడంతో రైతు లు సాగు చేసిన వరి పంటతోపాటు ఇతర పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయా యి. వరిపంట అయితే మొత్తం రైతులు ప శువులకు మే తగా వినియోగించారు. పంటలు కాపాడే ప్రయత్నంలో భా గంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కర్ణాటక ఇరిగేషన్‌శాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రిని కలిసి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరగా అప్పుడు కేవలం కర్ణాటక ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని మాత్రం విడుదల చేసింది.
అయినా పంట లు కాపాడలేకపోయారు. దీంతో గత యాసంగి సీజన్లో రైతులు వందల ఎకరాల్లో పంట నష్టపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పంటలను పరిశీలన చేసి నివేదిక పంపినప్పటికి పరిహారం మాత్రం రైతులకు అందలేదు. గత అనుభవం ఈసారి కూడా రైతులకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో యాసంగికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల నీటి లభ్యతను బట్టి యాసంగి సాగునీటి షెడ్యూల్ విడుదల చేశారు. అందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా వారబంధి ద్వారా విడుదల చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగా రైతులు యాసంగిలో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూ చించినప్పటికీ రైతులు ఎక్కువ భాగం వరి సాగు చేయడంతో ప్రస్తుత నీటి విడుదలపై సందిగ్ధం నెలకొన్నది. అధికారులు రైతులను ఆరుతడి పంటలు వేసుకోమంటే తరి పంటలు వేసుకోవడంతో ప్రస్తుతం నీరు పంట చేతికి వచ్చే వరకు సరిపోతుందా? లేదా? అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు.

జూరాల కింద ప్రతిపాదిత ఆయకట్టు..
జూరాల ప్రాజెక్టు కింద నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంతోపాటు కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. వీటితోపాటు మి షన్ భగీరథకు జూరాల ప్రాజెక్టు నుండే నీటిని తీ సుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగిన సమావేశంలో యాసంగి సాగుకు అవసరమైన నీటి విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లాల సీఈలు, ఎస్ఈలు, ఈఎన్సీల సమావేశం డిసెంబర్ 3న నిర్వహించారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై ఆరా తీశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా ఏఏ పంటలకు నీరు అందించాలో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 76,903 ఎకరాలు ఆ రుతడి, 25,018 ఎకరాల వరి పంటకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇందులో జూరాల ప్రాజె క్టు కుడి, ఎడమ కాల్వల కింద 20,014 ఎకరాలు ఆరు తడి, 6,910ఎకరాల వరి, నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం కింద 22,800 ఎకరాలకు ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. వీటితోపాటు రాజీవ్‌భీమా లిఫ్ట్రిగేషన్ లిఫ్ట్ కింద 5,350, ఎకరాల ఆరుతడి, 4,650 ఎకరాల వరి పంటలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. దీంతోపాటు ఎంజీకేఎల్‌ఐఎస్ కింద 28,739 ఎకరాల ఆరుతడి, 13,458 ఎకరాల వరి పంటకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం జూరాలలో నీరు రోజురోజుకు ఇంకిపోవడం, లీకేజీల ద్వారా నీరు దిగువకు వెళ్లడం తదితర సమస్యల కారణంగా వేసవికాలం లో అటు సాగు ఇటు తాగునీటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతోపాటు రామన్‌పాడ్ తాగునీటి పథకానికి ఈ నీటినే వినియోగిస్తున్నారు. దీంతో ఇటు రైతులు అటు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం జూరాలలో పరిస్థితి..
జూరాల, నెట్టెంపాడ్ కింద పంటలు చేతికి రావాలంటే అధికారులు వేసిన అంచనా ప్రకారం 6.45 టీఎంసీల(జూరాల 4.17టీఎంసీలు, నెట్టెంపాడ్ 2.28 టీఎంసీలు) నీరు అవసరం. అయితే జూరా ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు. ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ వచ్చేసి 3.7టీఎంసీలుగా ఉంటు ంది. ప్రస్తుతం జూరాలలో డెడ్ స్టోరే జీ నీటితో కలుపుకొని 6.431ఉంది. ఈ నీటినే సాగునీటికికి విడుదల చేయడంతోపాటు వేసవి ముగిసే వరకు తాగు నీటి అవసరాల కోసం 0.4 టీఎంసీల నీరు వాడుకోవాలి.