అహ్మదాబాద్: వేటాడిన జంతువును తింటున్న సింహం దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. (Man Tries To Record Lion) గమనించిన ఆ సింహం అతడిపై దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తు అతడు తప్పించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని భావ్నగర్లో ఈ సంఘటన జరిగింది. సింహాలు తిరిగే ప్రాంతంలోకి కొందరు వ్యక్తులు వెళ్లారు. ఒక చోట వేటాడి చంపిన జంతువును సింహం తింటున్నది. గుంపులోని ఒక వ్యక్తి ఆ సింహం సమీపంలోకి వెళ్లాడు. దగ్గర నుంచి దానిని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు.
కాగా, గమనించిన సింహం ఆ వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. అలెర్ట్ అయిన అతడు వెనకకు పరుగెత్తాడు. ఆ వ్యక్తితో పాటు మరి కొందరు ఉండటంతో ఆ సింహం వెనక్కి తగ్గింది. తన ఆహారం తినేందుకు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి, ఇతరులు ఆ సింహం బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. అతడు కూడా దానికి ఆహారం అయ్యేవాడని, అదృష్టవశాత్తు బతికిపోయాడని కొందరు కామెంట్ చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.
शेर मजे से अपना शिकार खा रहा है तभी यह युवक शेर के पास फोटे खींचने के लिए पहुंच गया. जिसपर शेर ने थोड़ी नाराज़गी दिखाई. वीडियो गुजरात के भावनगर का है. pic.twitter.com/91vUmKmi4F
— Priya singh (@priyarajputlive) August 4, 2025
Also Read:
Abhishek Banerjee | లోక్సభలో తృణమూల్ నేతగా అభిషేక్ బెనర్జీ
Thief Asleep After Robbery | చోరీ తర్వాత అలసి నిద్రపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Slits Woman’s Throat | మతమార్పిడి, పెళ్లికి నిరాకరణ.. మహిళ గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి