కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)ని లోక్‌సభలో పార్టీ నేతగా నియమించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభలో టీఎంసీకి 29 మంది ఎంపీలున్నారు.
కాగా, 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని లోక్‌సభలో పార్టీ నేతగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా పలు దేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో కూడా ఆయన ఉన్నారు.
Also Read:
Prashant Kishor | ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఈసీ తొలగిస్తున్నది: ప్రశాంత్ కిషోర్
Thief Asleep After Robbery | చోరీ తర్వాత అలసి నిద్రపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Slits Woman’s Throat | మతమార్పిడి, పెళ్లికి నిరాకరణ.. మహిళ గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి
Drunk Army Officer Hits People | తాగిన మత్తులో.. 30 మందిని కారుతో ఢీకొట్టిన ఆర్మీ అధికారి