ఫిట్స్‌కి సర్జరీ అవసరమా?
మా బాబుకి రెండో సంవత్సరంలో ఫిట్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి తరచుగా వస్తున్నాయి. నాలుగేళ్లు రకరకాల మందులు వాడాము. మొదట్లో మందులకు ఈ ఫిట్స్ కంట్రోల్ అయ్యాయి. కొంతకాలానికి మళ్లీ తీవ్రం అయ్యాయి. మళ్లీ డాక్టర్‌కి చూపించాం. మందులు స్టార్ట్ చేశాం. ఆరు నెలల పాటు ఫిట్స్ రావడం ఆగిపోయింది.
- పిల్లల పెంపకం
మా బాబుకి రెండో సంవత్సరంలో ఫిట్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి తరచుగా వస్తున్నాయి. నాలుగేళ్లు రకరకాల మందులు వాడాము. మొదట్లో మందులకు ఈ ఫిట్స్ కంట్రోల్ అయ్యాయి. కొంతకాలానికి మళ్లీ తీవ్రం అయ్యాయి. మళ్లీ డాక్టర్‌కి చూపించాం. మందులు స్టార్ట్ చేశాం. ఆరు నెలల పాటు ఫిట్స్ రావడం ఆగిపోయింది. నాలుగు నెలల నుంచి మళ్లీ వస్తున్నాయి. ఈఈజీ, ఎంఆర్ఐ చేయించాం. మందులు ఇచ్చారు. ఈ మందులు వాడిన తర్వాత అపెలెప్సీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. మరికొన్ని టెస్టులు కూడా చేయాల్సి ఉంటుందన్నారు. వాటిని బట్టి సర్జరీ ఎలా చేయాలనేది నిర్ణయమవుతుందని డాక్టర్ చెప్పారు. ఒక వయసు తర్వాత ఈ మూర్ఛ వ్యాధి పోతుందని కుటుంబ సభ్యులు చెప్పారు. దీని కోసం సర్జరీ అవసరమా? ప్రత్యామ్నాయం లేదా?
ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) అరుదుగా వస్తుంది. జ్వరం ఎక్కువగా వచ్చినప్పుడు పిల్లలకు ఫిట్స్ వస్తాయి. ఇవి మూడు నుంచి అయిదు సంవత్సరాల వయసులో వాటంతటవే తగ్గిపోతాయి. కానీ, కొందరిలో పుట్టినప్పటి నుంచి తరచుగా ఫిట్స్ రావడం చూస్తుంటాం. వీటిని అపెలెప్సీ అంటారు. ఈఈజీ, ఎంఆర్ఐ పరీక్షలు సాధారణంగా చేస్తారు. జన్యు లోపాలు, ఇన్ఫెక్షన్లు, మెదడు నిర్మాణంలో లోపాలు, మెదడులో ట్యూమర్లు పెరగడం, మెదడులో రక్తస్రావం కావడం వల్ల ఫిట్స్ వస్తాయి. కొంతమంది పిల్లల్లో ఈ మూర్ఛ వ్యాధి మందులకు తగ్గిపోతుంది. డాక్టర్లు ఈఈజీ పరీక్ష చేసిన తర్వాత ఎప్పుడు మందులు ఆపాలో చెబుతారు. కానీ 20 నుంచి 30 శాతం మంది పిల్లల్లో మందులు వాడినా ఫిట్స్ కంట్రోల్ కావు. దీనిని ‘డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపెలెప్సీ’ అంటారు. ఇలాంటి పిల్లలను లాంగ్ టర్మ్ మానిటరింగ్ చేయాల్సి రావొచ్చు. రెండు, మూడు రోజులపాటు నిరంతరం ఈఈజీ తీస్తాం. దీని ద్వారా ఫిట్స్ ఎప్పుడు, ఏ భాగంలో మొదలవుతున్నాయి? ఎలాంటి ఫిట్స్ వస్తున్నయో గుర్తిస్తాం. దాని తర్వాత ఎంఆర్ఐ, అవసరమైన ఇతర పరీక్షలు కూడా చేయిస్తాం.
ఈ అన్ని పరీక్షల ఆధారంగా ఫిట్స్ మెదడులో ఏ భాగం నుంచి వస్తున్నాయో నిర్ధారణ అవుతుంది. అలాగే మెదడులో ఫిట్స్ మొదలయ్యే భాగంలో ఉన్న సమస్య కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత.. మెదడు నిర్మాణంలో లోపాలు ఉంటే సరిచేస్తారు. మెదడులో సమస్యకు కారణమైన భాగాన్ని తొలగిస్తారు. అప్పుడు ఫిట్స్‌ని తగ్గించవచ్చు. ఎక్కడ సమస్య ఉందో తెలిసినప్పుడు మెదడుకు శస్త్ర చికిత్స చేస్తాం. కానీ కొందరిలో ఎక్కడ సమస్య ఉందో కచ్చితంగా తేలదు. అప్పుడు రకరకాల న్యూరో మాడ్యులేషన్ చికిత్సలు చేయాల్సిన అవసరం పడుతుంది. వగల్ నెర్వ్ మాడ్యులేషన్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి చికిత్సలతో ఫిట్స్‌ని నివారించడానికి, ఉపశమనం కలిగించడానికి అవకాశం ఉంది. మీ బాబుకు ఉన్న సమస్యకు కారణం ఆధారంగా చికిత్స చేస్తారు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయరు. అధిక జ్వరం వచ్చినప్పుడు పిల్లల్లో ఫిట్స్ కామన్‌గానే వస్తాయి. అన్నీ ఒకే రకమైనవి కావు. వాటి కారణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి కొందరికి వెంటనే తగ్గదు. చికిత్స దీర్ఘకాలం చేయాల్సి రావొచ్చు. కొందరికి ఆపరేషన్ అవసరం పడొచ్చు. మీ బాబుకి డాక్టర్లు చెప్పిన పరీక్షలన్నీ చేయించండి. ఏది అవసరమో డాక్టర్లు చెబితే అదే చికిత్స చేయించండి. బంధువులు, ఇతరులు చెప్పినట్టు వాళ్లకు తెలిసిన పిల్లలకు జరిగిన చికిత్స మీ బాబుకి సరిపోకపోవచ్చు.
డాక్టర్ కొక్కుల ప్రణీత్
పిడియాట్రిక్ న్యూరో సర్జన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

