శరీర సంకేతాలు అనారోగ్య మూలాలు
విపరీతమైన నీరసం, జుట్టు రాలడం.. ఇలా ఇంకొన్ని సమస్యలతో బాధపడేవాళ్లు ఉంటారు. డాక్టర్ సలహాతో రక్త పరీక్షలు చేయించుకుంటారు. సానింగ్ కూడా తీయించుకుంటారు. అన్ని రిపోర్టులూ ఆరోగ్యంగానే ఉన్నారని వస్తాయి. మరి ఆ అనారోగ్య సంకేతాలు ఎందుకొచ్చాయో అర్థం కాదు.
విపరీతమైన నీరసం, జుట్టు రాలడం.. ఇలా ఇంకొన్ని సమస్యలతో బాధపడేవాళ్లు ఉంటారు. డాక్టర్ సలహాతో రక్త పరీక్షలు చేయించుకుంటారు. సానింగ్ కూడా తీయించుకుంటారు. అన్ని రిపోర్టులూ ఆరోగ్యంగానే ఉన్నారని వస్తాయి. మరి ఆ అనారోగ్య సంకేతాలు ఎందుకొచ్చాయో అర్థం కాదు. అవి శరీరం పంపే రహస్య హెచ్చరికలు. వాటి గురించి తెలుసుకుంటే సగం పరిష్కారం అయినట్టే.
అలసట తగ్గదు : థైరాయిడ్ నియంత్రణలో ఉన్నట్టు రిపోర్టు రావొచ్చు. ఆ ఒక పరీక్ష పూర్తి నిజాన్ని చెప్పదు. థైరాయిడ్‌కు సంబంధించి మరికొన్ని లోతైన పరీక్షలు చేయకపోవడం వల్ల, సమస్య ఉన్నా అది బయటపడదు. ఫలితంగా నిరంతరం నీరసంగానే ఉంటారు.
ఏకాగ్రత లోపించడం: విటమిన్ బి12 లోపం కనిపించకపోయినా, అది మెదడు చురుగ్గా పనిచేయడానికి సరిపోకపోవచ్చు. అందువల్లే జ్ఞాపకశక్తి తగ్గడం, దేనిపైనా దృష్టి నిలపలేక
పోవడం. తల భారంగానూ అనిపిస్తుంది.
జుట్టు రాలడం: మీకు రక్తహీనత లేదని రిపోర్టులు నిర్ధారించినా శరీరంలో ఐరన్ నిల్వలు తకువగా ఉండటం వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. త్వరగా అలసిపోతారు. ఐరన్ లోపాన్ని సాధారణ బ్లడ్ కౌంట్ పరీక్షలు
ఒకోసారి గుర్తించలేవు.
ఆందోళన చెందడం : విటమిన్ డి తగినంత ఉన్నట్టుగానే ఉన్నా, శరీరానికి అవసరమైనంత ఉండకపోవచ్చు. విటమిన్ డి లోపం నేరుగా మీ మానసిక ఆరోగ్యాన్ని, రోగనిరోధక
శక్తిని దెబ్బతీస్తుంది.
బరువు పెరగడం : సాధారణంగా షుగర్ పరీక్షా ఫలితాలు నార్మల్‌గా ఉన్నా శరీరంలో ఇన్సులిన్ సమస్యలు నిశ్శబ్దంగా మీ బరువును పెంచుతుంటాయి. దీనివల్లే పదే పదే ఏదైనా తినాలనిపించడంతో కోరికను చంపుకోలేక బరువు పెరుగుతారు.
నిద్రలేమి : ఒకసారి చేసిన కార్టిసోల్ పరీక్ష మీ ఒత్తిడిని సరిగ్గా కొలవలేదు. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మీరు పగలు అలసిపోయినా, రాత్రిళ్లు మాత్రం నిద్ర పట్టక ఇబ్బంది
పడుతుంటారు.
వయసుతో వచ్చే మార్పులు: ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు వయసుకి తగ్గట్టుగా ఉన్నాయని రిపోర్టులు చెప్పవచ్చు. కానీ వీటిలో చిన్నపాటి మార్పులు కూడా మీ మూడ్ స్వింగ్స్, నీరసానికి కారణ మవుతాయి.
జీర్ణక్రియ సమస్యలు: కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అకస్మాత్తుగా వచ్చే ఫుడ్ అలర్జీలను తేలికగా తీసుకోవద్దు. పేగు ఆరోగ్యం దెబ్బతినడానికి ఇవి సంకేతాలు. దీనిపై సరైన పరీక్షలు జరగకపోతే సమస్య తీవ్రమవుతుంది.
నీరసం, జుట్టు రాలడం, నిద్రలేమి, జీర్ణ సమస్యలు.. ఇవన్నీ విడివిడి సమస్యలు కావు. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలన్నీ కలిపి చూస్తేనే అసలు అనారోగ్యం ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ వయసు వల్లనో, ఒత్తిడి వల్లనో జరుగుతున్నాయను కోకుండా శరీరం పంపే సంకేతాల వెనుక అసలు కారణాన్ని గుర్తించండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

