మాతృభాషంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నా
తెలుగులో స్టార్‌డమ్‌ని అనుభవిస్తూ కూడా తెలుగు నేర్చుకోవాలనే సోయి ఉండదు కొందరు కథానాయికలకు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తిసురేశ్, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్.. తదితర తారలు మాత్రం చక్కగా తెలుగు నేర్చుకొని, తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ, ఆదరించిన భాషపై అభిమానం చూపిస్తున్నారు.
తెలుగులో స్టార్‌డమ్‌ని అనుభవిస్తూ కూడా తెలుగు నేర్చుకోవాలనే సోయి ఉండదు కొందరు కథానాయికలకు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తిసురేశ్, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్.. తదితర తారలు మాత్రం చక్కగా తెలుగు నేర్చుకొని, తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ, ఆదరించిన భాషపై అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సంయుక్త మీనన్ కూడా చేరింది. రీసెంట్గా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడిన తెలుగు అందరిని ఆకట్టుకుంది. ఆ క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘తొలిరోజుల్లో నాకు అసలు తెలుగు రాదు.
‘విరూపాక్ష’ చేస్తున్న టైమ్‌లో తెలుగు నేర్చుకోవాలని ఫిక్సయ్యాను. నేర్పేందుకు ట్యూటర్లను పెట్టుకున్నాను. వారివల్లే ఇంత త్వరగా మాట్లాడగలుగుతున్నా. ప్రస్తుతం తెలుగు నా మాతృభాషలాగే మారిపోయింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా’ అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, నారీనారీ నడుమ మురారి.. ఇలా ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు విజయాలే. ఆమె నటించిన స్వయంభు, స్లమ్‌డాగ్ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

