పాట్నా: ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగిస్తున్నదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆరోపించారు. అయితే ఓటర్ జాబితాలో పేర్లు ఉన్న వారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సీఎం నితీశ్ కుమార్ను తొలగించడానికి సరిపోతారని అన్నారు. ఆదివారం ఏఎన్ఐతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై మండిపడ్డారు. మాట్లాడటానికి ఏ సమస్యలు ఆయనకు కనిపించలేదని, అందుకే ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తేజస్వీ యాదవ్ అంటున్నారని విమర్శించారు.
కాగా, ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఈసీ తొలగిస్తున్నదని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే ఎంతమంది పేర్లు తొలగిస్తారని ప్రశ్నించారు. అయినప్పటికీ బీహార్లో బీజేపీ, నితీశ్ కుమార్ను తొలగించడానికి జాబితాలో ఉన్న ఓటర్లు సరిపోతారని తెలిపారు. జాబితాలో పేర్లు లేని వారు ఈసీతో పోరాడుతారని అన్నారు.
మరోవైపు ఢిల్లీలో బీహార్ ప్రజలను రాహుల్ గాంధీ ‘ఎగతాళి’ చేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అలాగే పలు రాష్ట్రాల్లో బీహారీలపై దాడి జరిగినప్పుడు ఆయన ఖండించకపోగా ఉదాసీనత చూపిస్తున్నారని విమర్శించారు.
Also Read:
Man Slits Woman’s Throat | మతమార్పిడి, పెళ్లికి నిరాకరణ.. మహిళ గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి
Drunk Army Officer Hits People | తాగిన మత్తులో.. 30 మందిని కారుతో ఢీకొట్టిన ఆర్మీ అధికారి
Teen Jumps From Hill | తల్లి మొబైల్ ఫోన్ కొనడంలేదని.. కొండ పైనుంచి దూకి యువకుడు మృతి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?