WhatsApp Web : ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ (WatsApp) తన వెబ్ వెర్షన్ (Web version) లో కొత్త ఫీచర్ (New feature) ను తీసుకొచ్చింది. కొత్తగా వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. దాంతో యూజర్లు ఎలాంటి అదనపు సాఫ్ట్వేర్ ఉపయోగించకుండానే నేరుగా వెబ్ నుంచే ఆడియో/ వీడియో కాల్స్ చేయవచ్చు. యూజర్ల వ్యక్తిగత చాట్ విండోలో కాల్ బటన్ (Call Button) కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది.
కాగా వాట్సాప్‌లో ప్రస్తుతం ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడాలంటే.. మొబైల్ యాప్ ఉండాలి. ల్యాప్‌టాప్/ పీసీలపై పనిచేసే వారైతే వాట్సాప్ విండోస్ లేదా మ్యాక్ వెర్షన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్ వెబ్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తున్నది. ఎవరికైనా కాల్ చేయాల్సి వస్తే ఎలాంటి యాప్ డౌన్లోడ్ అవసరం లేకుండా ఇకపై నేరుగా కాల్స్ చేయవచ్చు. పరిమిత సంఖ్యలో యూజర్లకు తీసుకొచ్చిన ఈ సదుపాయం త్వరలో అందరికీ రానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మాదిరిగా వాట్సప్ వెబ్ నుంచి చేసే కాల్స్‌కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది.