కాస్త చల్లబడండి
శీతాకాలం ముగిసింది. ఎండాకాలం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ తగ్గడంతో రోగాల బారిన పడతారు.
శీతాకాలం ముగిసింది. ఎండాకాలం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ తగ్గడంతో రోగాల బారిన పడతారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి. ఈ సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు మారుతున్న సీజన్‌కి తగ్గట్టు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారం, హైడ్రేషన్‌పై దృష్టి పెట్టాలి.
వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ బారినపడతారు. వాతావరణ ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగినప్పుడు శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందుకే వేసవిలో ఫుడ్ పాయిజనింగ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి ఈ కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కొన్ని చిటాలు పాటిస్తే సరిపోతుంది. ఉసిరి, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే జామపండ్లు ఎక్కువగా తినాలి. వైరస్ నుంచి బయటపడేందుకు జింక్ ఉన్న బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్ తీసుకోవాలి. ఇక శరీర బలం కోసం పప్పులు, గుడ్లు, పనీర్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండేవాటిని ఆశ్రయించాలి.
పెరుగు లేదా పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. వేసవికాలంలో చెమట ఎకువగా పడుతుంది. ఇది డీహైడ్రేషన్, తకువ రక్తపోటు, అలసట, తలనొప్పి, వడదెబ్బకు దారితీస్తుంది. ఈ సమస్యలు రాకుండా నీరు తాగడం చాలా ముఖ్యం. రోజులో కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మామిడి పన్నా, మజ్జిగ వంటి సహజ పానీయాలు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో చల్లని నీరు తాగితే గొంతు నొప్పి రావొచ్చు. కాబట్టి, గోరువెచ్చని నీరు తాగడం మంచిది. మీతో పాటే ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

