చెన్నై: స్కూల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు వెతికారు. చివరకు స్కూల్లో మూసేసి ఉన్న బావిలో యువకుడి మృతదేహం లభించింది. (Student Found Dead in School) ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరుపత్తూరు సమీపంలోని ప్రభుత్వ ఎయిడెడ్ రెసిడెన్షియల్ స్కూల్ డొమినిక్ సావియో హయ్యర్ సెకండరీ స్కూల్లో 16 ఏళ్ల ముగిలన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
కాగా, ఆ క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థి శుక్రవారం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెతికారు. చివరకు ఆ స్కూల్ క్యాంపస్‌లో మూసి ఉన్న బావిలో ఆ విద్యార్థి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెరిచిన ఉన్న చిన్న గ్రిల్ నుంచి ఆ విద్యార్థి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వెల్లూరు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ అధికారులు, జిల్లా బాలల రక్షణ అధికారితో కలిసి హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు.
మరోవైపు తమ కుమారుడు ముగిలన్ మరణానికి స్కూల్ ప్రిన్సిపాల్, ఫాదర్ జేసు మాణిక్కం కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయనను అరెస్టు చేయాలని, ఆ స్కూల్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, మత సంస్థలతో కలిసి హాస్పిటల్ వద్ద నిరసన తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకోబోమంటూ ఆందోళన చేశారు.
Also Read:
Thief Asleep After Robbery | చోరీ తర్వాత అలసి నిద్రపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Slits Woman’s Throat | మతమార్పిడి, పెళ్లికి నిరాకరణ.. మహిళ గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి
Drunk Army Officer Hits People | తాగిన మత్తులో.. 30 మందిని కారుతో ఢీకొట్టిన ఆర్మీ అధికారి