ఖలీల్వాడి, మార్చి 5: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన కొత్త గొల్ల కిషన్, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. చిన్న కొడుకు భానుప్రకాశ్ (23) ఇంటి వద్దే ఉంటున్నాడు. మద్యానికి అలవాటుపడిన భానుప్రకాశ్ డబ్బుల కోసం తరచూ కుటుంబసభ్యులను వేధించేవాడు. ఇంట్లో ఉంటున్న తండ్రితో బుధవారం మరోసారి డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. దీంతో విసిగిపోయిన తండ్రి… కొడుకు భానుప్రకాశ్ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. గురువారం ఉదయం ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.