భోపాల్: ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి విహారయాత్ర కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగుతుండగా కొందరు వ్యక్తులు వచ్చారు. స్నేహితుడ్ని కొట్టి అడ్డుకున్నారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Dalit Woman Gang Raped) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక యువతి తన స్నేహితుడితో కలిసి చుర్హాట్ అటవీ ప్రాంతానికి విహార యాత్ర కోసం వెళ్లింది. అడవిలోని కాలి బాటలో మరింత లోపలకు వారు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగారు.
కాగా, ఐదుగురు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. కర్రతో స్నేహితుడి తలపై కొట్టారు. ఇద్దరు వ్యక్తులు అతడ్ని పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ఆ యువతిని దూరంగా లాక్కెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించారు. ఇద్దరి మొబైల్ ఫోన్స్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు స్నేహితుడితో కలిసి అటవీ ప్రాంతం నుంచి బయటపడిన దళిత యువతి సమీపంలోని గ్రామానికి చేరుకున్నది. అక్కడున్న కార్మికులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో గ్రామ సర్పంచ్ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాధిత దళిత యువతిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. నిందితుల కోసం ఆ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Cop Hacked To Death | తండ్రీ, కొడుకుల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న పోలీస్ అధికారిని నరికి చంపారు
Sanjay Nishad | మీ ఇంటి గుమ్మం వద్దకే గంగా నది వచ్చిందన్న మంత్రి.. మీరే ఆశీర్వాదం తీసుకోవాలన్న మహిళ
Watch: సింహాన్ని వీడియో తీసేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?