ఇండోర్, ఫిబ్రవరి 21: లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను ప్రయాగ్రాజ్లోని ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశించింది. స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, ఆయన శిష్యుడు స్వామి ముకుందానంద గిరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏడీజే(పోక్సో చట్టం) వినోద్ కుమార్ చౌరాసియా ఆదేశించారు.
మఠంలోని 20 మంది పిల్లలపై లైంగిక దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.