ముంబై, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హిందుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం మహారాష్ట్రలోని భివండీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆయన కొత్త పూచీకత్తును ఆమోదించి, బెయిల్ మంజూరు చేసింది.
2014 ఎన్నికల సందర్భంగా భివండిలో జరిగిన సభలో ఆర్ఎస్ఎస్కు చెందిన వారే గాంధీజీని చంపారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై భివండిలోని ఆర్ఎస్ఎస్ స్థానిక జిల్లా కార్యకర్త రాజేష్ కుంటే పరువు నష్టం కేసు దాఖలు చేశారు.