రాయ్‌పూర్: మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. ఆ ఇంటి ఆవరణలోని ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని చోరీ చేశాడు. (Man Steals Brass Elephant) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అంబికాపూర్‌లోని మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌డియో నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. చారిత్రిక సర్గుజా ప్యాలెస్ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న కోఠి ఘర్లోకి అతడు ప్రవేశించాడు. రెండేళ్ల కిందట రెండు ఇత్తడి ఏనుగు విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో ఒక దానిని ఆ వ్యక్తి చోరీ చేశాడు. అపహరించిన15 కిలోల బరువైన ఈ బ్రాస్ ఎలిఫెంట్ విలువ సుమారు రూ.40,000 ఉంటుందని అంచనా.
కాగా, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన సందర్భంగా ఇత్తడి ఏనుగు విగ్రహం చోరీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సర్గుజా రాజ కుటుంబానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌డియో చోరీ సమయంలో ఆ ఇంట్లో లేరని, ఆయన విదేశాల్లో ఉన్నారని వెల్లడించారు.
अम्बिकापुर
पूर्व डिप्टी सीएम @TS_SinghDeo के घर पर चोरों का धावा
कोठीघर कैम्पस से हाथी की मूर्ति चोरी
पोर्च पर लगी 15 किलो वजनी हाथी की मूर्ति चोरी कर ले भागे चोर
कोतवाली पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है #Ambikapur #Chhattisgarh pic.twitter.com/8hvwMQ4sNj
— Anshuman Sharma (@anshuman_sunona) August 6, 2025
Also Read:
Swami Prasad Maurya | మాజీ మంత్రి చెంపపై కొట్టిన కర్ణిసేన కార్యకర్త.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman patient molested | సగం స్పృహలో ఉన్న మహిళా రోగిని.. ముద్దుపెట్టుకున్న హాస్పిటల్ ఉద్యోగి
Odisha Woman Dies By Suicide | ప్రియుడు బ్లాక్మెయిల్.. నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్య