భువనేశ్వర్: సన్నిహిత ఫొటోలతో ప్రియుడు బ్లాక్మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. (Odisha Woman Dies By Suicide) ఆరు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ యువతి తండ్రి ఆరోపించాడు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. కేంద్రపారా జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువతి ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి సన్నిహిత ఫొటోలతో వేధించడంతోపాటు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. విసిగిపోయిన ఆ యువతి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నది. తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రియుడి వేధింపులు, బ్లాక్మెయిల్ గురించి తన కుమార్తె ఆరు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆ యువతి తండ్రి తెలిపాడు. పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని అతడు బెదిరించినట్లు చెప్పాడు. అయినప్పటికీ ఇంత వరకు పోలీసులు స్పందించలేదని, ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహిళ తండ్రి ఆరోపించాడు. మరోవైపు జూలై 12 నుంచి ఒడిశాలో ముగ్గురు యువతులు నిప్పంటించుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Also Read:
Dalit Woman Gang Raped | స్నేహితుడ్ని అడ్డుకుని.. దళిత మహిళపై సామూహిక అత్యాచారం
Woman patient molested | సగం స్పృహలో ఉన్న మహిళా రోగిని.. ముద్దుపెట్టుకున్న హాస్పిటల్ ఉద్యోగి
Swami Prasad Maurya | మాజీ మంత్రి చెంపపై కొట్టిన కర్ణిసేన కార్యకర్త.. తర్వాత ఏం జరిగిందంటే?
Cop Hacked To Death | తండ్రీ, కొడుకుల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న పోలీస్ అధికారిని నరికి చంపారు