Virosh Wedding | టాలీవుడ్ కొత్త జంట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందనలకి స్పెషల్ సర్ప్రైజ్ని ఇచ్చారు రణబాలి మేకర్స్. వీరిద్దరూ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాలో విజయ్ ‘రణబాలి’గా, రష్మిక ‘జయమ్మ’గా నటిస్తున్నారు. ఇటీవల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వీరికి చిత్రబృందం స్పెషల్ సర్ప్రైజ్ని ఇస్తూ.. చిత్రంలోని రొమాంటిక్ మెలోడీ “ఎందయ్య సామి” పాటను విడుదల చేశారు.
ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. తెలుగులో ‘ఎందయ్య సామి’, తమిళంలో ‘ఎదయ్యా సామి’, హిందీలో ‘ఓ మేరే సాజన్’ అంటూ ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. పాటలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ మునుపటి ‘గీత గోవిందం’ రోజులను గుర్తు చేస్తోందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (మమ్మీ ఫేమ్) కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.