MohanBabu | ‘వెంకటప్పయ్య నాయుడు’గా కలెక్షన్ కింగ్.. ‘శ్రీనివాస మంగపురం’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!
Srinivasa Mangapuram | కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మరోసారి వెండితెరపై తన గంభీరమైన నటనతో అలరించబోతున్నారు.
Srinivasa Mangapuram | కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మరోసారి వెండితెరపై తన గంభీరమైన నటనతో అలరించబోతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగపురం’ అనే క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు పోషిస్తున్న “వెంకటప్పయ్య నాయుడు” పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ పోస్టర్లో మోహన్ బాబు లుక్ ఎంతో పవర్ ఫుల్ గా, రాజసంతో ఉట్టిపడుతోంది. గర్వం, ధైర్యం కలగలిసిన ఒక గంభీరమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు అజయ్ భూపతి, మోహన్ బాబును ఒక సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకి పరిచయం కాబోతుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
Introducing the Legendary @themohanbabu garu as “VENKATAPPAYA NAIDU” from #SrinivasaMangapuram❤️🔥
Brace yourselves for his towering performance in a role carved with power and pride💥@DirAjayBhupathi #JayaKrishnaGhattamaneni #RashaThadani @AshwiniDuttCh @gemini_kiran @gvprakash pic.twitter.com/kB7D0kcJQL
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

