కోటడిరి : నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు.
ఈ క్రమంలో ఇవాళ కూడా డబ్బుల కోసం భూమవ్వతో గొడవపడ్డాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో దాడి చేసి చంపాడు. తల్లిపై ఇంట్లోని పాత దుస్తులు వేసి నిప్పంటించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.