కోల్‌కతా: సగం స్పృహలో ఉన్న మహిళా రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది అనుచిత చర్యకు పాల్పడ్డాడు. వార్డులోకి తరలిస్తున్న సమయంలో ఆమెను ముద్దుపెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. (Woman patient molested) బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో ఆసుపత్రి ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 3న పిత్తాశయంలో రాళ్ల తొలగింపు ఆపరేషన్ కోసం ఎక్బల్పూర్లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఒక మహిళ అడ్మిట్ అయ్యింది.
కాగా, హాస్పిటల్ ఉద్యోగి 33 ఏళ్ల అబ్దుల్ సుభాన్, పాక్షికంగా స్పృహలో ఉన్న ఆ మహిళను జనరల్ వార్డు నుంచి మూడో అంతస్తులోని డ్యూయల్ క్యాబిన్‌కు తరలించాడు. ఈ సందర్భంగా అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె పెదవులపై ముద్దుపెట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు పోలీసులు వెంటనే ఆ నర్సింగ్ హోమ్‌కు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదును నిర్ధారించుకున్న తర్వాత కేసు నమోదు చేశాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన హాస్పిటల్ ఉద్యోగి అబ్దుల్ సుభాన్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Swami Prasad Maurya | మాజీ మంత్రి చెంపపై కొట్టిన కర్ణిసేన కార్యకర్త.. తర్వాత ఏం జరిగిందంటే?
Dalit Woman Gang Raped | స్నేహితుడ్ని అడ్డుకుని.. దళిత మహిళపై సామూహిక అత్యాచారం
Cop Hacked To Death | తండ్రీ, కొడుకుల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న పోలీస్ అధికారిని నరికి చంపారు