న్యూఢిల్లీ: ఒక వ్యక్తి పదేళ్ల తర్వాత సాధువు వేషంలో భార్య ఇంటికి వెళ్లాడు. విడిగా నివసిస్తున్న ఆమె తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. (Disguised As Sadhu, Man Kills Wife) ఆ తర్వాత ఆ ఇంటి నుంచి పారిపోయాడు. మహిళ హత్య సమచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని ముంగేర్ జిల్లా చిడియాబాబాద్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల ప్రమోద్ ఝా, భార్య కిరణ్ పదేళ్ల కిందట విడిపోయారు. కుమారుడు దుర్గేష్, కోడలు, మనవరాలితో కలిసి ఢిల్లీలోని నెబ్ సారాయ్‌లోని ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, ఆగస్ట్ 1న బీహార్‌లోని తన గ్రామం నుంచి ఢిల్లీకి ప్రమోద్ చేరుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున భార్య కిరణ్ నివసిస్తున్న ఇంటికి సాధువు వేషంలో వెళ్లాడు. సుత్తితో తలపైకొట్టి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తెల్లవారుజామున 4 గంటలకు రక్తం మడుగుల్లో పడి మరణించిన కిరణ్‌ను ఆమె కుటుంబం గమనించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సాధువు వేషంలో ఆ ఇంటి నుంచి పారిపోతున్న నిందితుడ్ని ప్రమోద్‌గా పోలీసులు గుర్తించారు. కిరణ్ హత్య సమయంలో ఆమె కుమారుడు ఢిల్లీలో లేడని, ఉద్యోగం నిమిత్తం బీహార్‌లో ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. పదేళ్ల తర్వాత విడిపోయిన భార్యను ప్రమోద్ ఎందుకు హత్య చేశాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ బృందాలు అతడి కోసం వెతుకుతున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Newly-Wed Girl Kills Husband | ప్రియుడ్ని పెళ్లాడేందుకు.. భర్తను హత్య చేసిన నవ వధువు
Odisha Woman Dies By Suicide | ప్రియుడు బ్లాక్మెయిల్.. నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్య
Watch: మాజీ డిప్యూటీ సీఎం ఇంటి నుంచి.. ఇత్తడి ఏనుగు విగ్రహం చోరీ చేసిన దొంగ