రాంచీ: ప్రియుడితో కలిసి జీవించేందుకు, అతడ్ని పెళ్లాడేందుకు నవ వధువు దారుణానికి పాల్పడిండి. నెల కిందట పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడి సహాయంతో హత్య చేసింది. (Newly-Wed Girl Kills Husband) దర్యాప్తు చేసిన పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం వెతుకుతున్నారు. జార్ఖండ్‌లోని పలము జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దహి గ్రామానికి చెందిన సర్ఫాజ్ ఖాన్, సింజో గ్రామానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయికి జూన్ 22న పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా వారిద్దరూ తమ ఇళ్లల్లో విడిగా నివసిస్తున్నారు.
కాగా, ఆ అమ్మాయికి ఒక ప్రియుడు ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తితో కలిసి ఉండేందుకు, అతడ్ని పెళ్లాడేందుకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. జూలై 31న నవజైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపర్వా అటవీ ప్రాంతానికి భర్త సర్ఫాజ్ ఖాన్‌ను ఆమె రప్పించింది. ప్రియుడితో కలిసి బండరాళ్లతో మోది హత్య చేసింది. మృతదేహంపై ఆకులు కప్పి పారిపోయారు.
మరోవైపు అటవీ ప్రాంతంలో సర్ఫాజ్ ఖాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరకు నవ వధువు తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, ప్రియుడితో కలిసి ఉండేందుకు, అతడ్ని పెళ్లాండేందుకు భర్త సర్ఫాజ్ ఖాన్‌ను హత్య చేసినట్లు ఆ అమ్మాయి ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. మైనర్ బాలిక కావడంతో జువైనల్ హోమ్‌కు ఆమెను తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Odisha Woman Dies By Suicide | ప్రియుడు బ్లాక్మెయిల్.. నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్య
Woman patient molested | సగం స్పృహలో ఉన్న మహిళా రోగిని.. ముద్దుపెట్టుకున్న హాస్పిటల్ ఉద్యోగి
Watch: మాజీ డిప్యూటీ సీఎం ఇంటి నుంచి.. ఇత్తడి ఏనుగు విగ్రహం చోరీ చేసిన దొంగ
Dalit Woman Gang Raped | స్నేహితుడ్ని అడ్డుకుని.. దళిత మహిళపై సామూహిక అత్యాచారం