Avika Gor | తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న “చిన్నారి పెళ్లికూతురు” అవికా గోర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్‌తో గుర్తింపు పొందిన అవికా గోర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి ఒక ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా జరిగిన ఘటన నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అవికా గోర్ తన భర్తతో కలిసి ఫోటోలకు పోజులు ఇస్తూ చాలా ఆనందంగా కనిపించింది. అయితే అకస్మాత్తుగా ఆమెకు అస్వస్థత కలగడంతో వాంతులు చేసుకున్నట్టు వీడియోలో కనిపించింది. వెంటనే పరిస్థితిని గమనించిన మిలింద్ చంద్వానీ అక్కడున్న ఫోటోగ్రాఫర్లను ఫోటోలు తీయవద్దని కోరుతూ అవికాను లోపలికి తీసుకెళ్లారు.
ఈ ఘటనతో అభిమానులు అవికా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఆమె త్వరలోనే తల్లి కాబోతోందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఇది ప్రెగ్నెన్సీ లక్షణం కావచ్చని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం సాధారణ అనారోగ్యమే కావొచ్చని అంటున్నారు. ఇంకా కొందరు అయితే ఈ విషయం కేవలం రూమర్ మాత్రమే కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై అవికా గోర్ గానీ, మిలింద్ చంద్వానీ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.
‘చిన్నారి పెళ్లికూతురు’ (బాలికా వధు) సీరియల్లో ఆనంది పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవికా గోర్, తరువాత తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మామ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అవికా. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోతో ఆమె ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలు నిజమా కాదా అన్నది తెలుసుకోవాలంటే అవికా లేదా మిలింద్ స్పందించాల్సి ఉంది. అప్పటివరకు మాత్రం ఈ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.