– బీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది
– కేసీఆర్ స్ఫూర్తితో తోఫా పంచిన మాజీ కౌన్సిలర్ తోట లలిత శారద
– అభినందించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లెందు, మార్చి 11 : తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ తోట లలిత శారద ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పాలనో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన విధానాన్ని అనుసరిస్తూ ఆరో వార్డులో 25 మంది ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని మతాల పండగలను గౌరవిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించి పేదలు ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించారన్నారు. ప్రత్యేకంగా ముస్లింలకు రంజాన్ మాసంలో తోఫా పంపిణీ చేసి పేదలు పండుగ మంచిగ జరుపుకునేలా సహకరించేవారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాల సంప్రదాయాలను గాలికి వదిలేసి పేదల ఉసురు పోసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ సందర్భంగా లలిత శారదను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిలువేరి సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ జబ్బార్, 18వ వార్డు కౌన్సిలర్ పాబోలు స్వాతి, మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ తారా, పట్టణ నాయకులు పాబోలు కిరణ్, యువజన విభాగం గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, చాంద్ పాషా, మీర్జాబేగ్, బీపీన్ రాథోడ్, 6వ వార్డ్ కమిటీ కంకణాల రాజేశ్, తోట అరుణ్ కుమార్, రియాజ్ పాల్గొన్నారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేద ముస్లింలకు అన్యాయం’