RS Praveenkumar | ఈ రోజు అత్యంత విషాదకరమైన పరిస్థితిలో ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై వైద్యం పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నామంచి పేరు ఉన్న వైద్యులతో ఎప్పటికప్పుడు కేసీఆర్ సంప్రదింపులు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా సెక్యూరిటీ రివ్యూ అని పెట్టీ భద్రతను కుదింపు చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా సెక్యూరిటీ కుదింపు చేసింది. చిన్నతనంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. వరంగల్ జిల్లాలో ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్న వయస్సులోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆయుధ లైసెన్స్ ఉన్నది. దాదాపు 25 సంవత్సరాల నుండే ఆయనకు భద్రత దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ కూడా ఇచ్చారు . 8 సంవత్సరాల కాలం పార్టీ కి వరంగల్ జిల్లా అద్యక్షుడు పదవిలో ఉన్నాడు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్గా జీతం తీసుకోకుండా పని చేశాడు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. చాలా ఒత్తిడికి లోనయ్యారు. ఆయనను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేసింది.
పెద్ది సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పని చేసినపుడు సివి ఆనంద్ కమిషనర్ గా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే రూ.1100 కోట్ల కుంభకోణంను ఆయన బయటకు తీశాడు. అనేక దర్యాప్తు సంస్థలకు పిర్యాదు చేశారు. ఒక్క రూపాయి లేకుండానే నేరుగా కాంగ్రెస్ నాయకులకు చేరాయి అని అనేక వాస్తవాలతో మీడియా ముందుకు తెచ్చాడు. గురుకుల పాఠశాలల్లో బంకర్ బెడ్లలో కూడా కుంభకోణాలు పెద్ది సుదర్శన్ రెడ్డి బయటకు తీశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటకు రాగానే పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్ లైసెన్స్ ఇవ్వకుండా చేశారన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఘోరంగా టార్గెట్ చేసింది
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో, సోదరులతో, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఇది అర్థమైంది
పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్నప్పుడు, ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్… https://t.co/5AV7IWb5Fq pic.twitter.com/VJZrjg0in5
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు