అదెంత పని? గుంజలను ఎక్కి పందిరి వేస్తాలే! అదేమన్నా బ్రహ్మవిద్యనా?
‘అయ్యో! పందిరి వేయడానికి వేణు లేడు కదా! ఇప్పుడెలా!?’ అన్నాడు. ఆ మాటలు విన్న రాము.. ‘ఓ! అదెంత పని? నేను గుంజలను ఎక్కి పందిరి వేస్తాలే! అదేమన్నా బ్రహ్మవిద్యనా ఏమిటి?’ అంటూ గొప్పలకు పోయాడు.
అల్లరి, గొప్పల కోసం
నరసింహపురంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునేవాడు. తానే గొప్పవాడినని విర్రవీగేవాడు. ఇలా ఉండగా, ఒకరోజు అతని మిత్రుడు రవి చెల్లె పెళ్లి కోసం పందిళ్లు వేయడానికి రాముతోపాటు మరికొందరు మిత్రులు రవి ఇంటికి వెళ్లారు. మిత్రులంతా తలా ఒక పని చేయసాగారు. ఎక్కడా ఎండ రాకుండా.. వాకిలంతా పందిళ్లు వేయాల్సి వచ్చింది. వేణు అనే మరో మిత్రుడు పైకి ఎక్కి చక్కగా పందిళ్లు వేస్తాడు. అయితే, ఆరోజు అతనికి జ్వరం రావడం వల్ల.. రవి ఇంటికి రాలేకపోయాడు. అప్పుడు రవి.. ‘అయ్యో! పందిరి వేయడానికి వేణు లేడు కదా! ఇప్పుడెలా!?’ అన్నాడు.
ఆ మాటలు విన్న రాము.. ‘ఓ! అదెంత పని? నేను గుంజలను ఎక్కి పందిరి వేస్తాలే! అదేమన్నా బ్రహ్మవిద్యనా ఏమిటి?’ అంటూ గొప్పలకు పోయాడు. చకచకా పాకుతూ ఒక గుంజపైకి ఎక్కాడు. అయితే, తాడును కట్టే సమయంలో పట్టుతప్పి దబాలున కింద పడ్డాడు. అదృష్టం కొద్దీ కింద ఇసుక ఉండటంతో.. దెబ్బలేవీ తగలకుండానే బయటపడ్డాడు. రాము కింద పడటం చూసిన మిగతా మిత్రులు.. ‘ఒరేయ్! మనకు రాని పనిని మనం గొప్పల కోసం చేయకూడదు. అదృష్టం కొద్దీ అక్కడ ఇసుక ఉండటం వల్ల దెబ్బలు తగలలేదు. ఒకవేళ ఇసుక లేకుంటే.. నీ కాలో చేయో విరిగి ఆసుపత్రిలో ఉండేవాడివి!’ అని అన్నారు. అప్పుడు రాము.. ‘మీరన్నది నిజమే! మనకు చేతనైన పనే మనం చేయాలి. లేకపోతే ఇలా భంగపాటు తప్పదు!’ అని అన్నాడు.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
చెప్పుకోండి
మనిషికి జీవితాంతం తోడుగా ఉండే పాము?
– వెన్నుపాము
నీరు తగిలితే గుప్పెడవుతుంది. ఎండ తగిలితే గంపెడవుతుంది?
– దూది
అడ్డగోడ మీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు, అటు పక్క పడదు?
– ఎద్దు మూపురం

Gandhi
పెద్దల మాట
ఆశ మనిషిని గొప్పవాణ్ని చేస్తుంది. దురాశ అదే మనిషిని నీచుడిగా మారుస్తుంది.
– మహాత్మా గాంధీ
నిజంగా నిజం
ట్విటర్ లోగోలో కనిపించే పక్షి పేరు.. లారీ.
ప్రపంచవ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై మిక్కీ మౌస్ కనిపిస్తుంది.
పద్యం – భావం
మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: భర్త బతికి ఉన్నపుడు భార్య కష్టపడితే.. కొడుకుల కాలంలో ఇబ్బంది పడకుండా బతుకుతుంది. ఎంతవారైనప్పటికీ సంపద, దారిద్య్రం.. రెండిటినీ అనుభవించాల్సిందే కదా!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

