వార ఫలాలు నవంబర్ 29 డిసెంబర్ 5 వరకు
ఆదరాభిమానాలు పొందుతారు. పనిభారం పెరుగుతుంది. పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇవి ఏ రాశివారికి జరిగే రాశిఫలాలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఇస్తున్న వారఫలాల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు
మేషం
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శివాలయాన్ని సందర్శించండి.
వృషభం
పనిభారం పెరుగుతుంది. సమర్థంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమయ పాలన పాటించడం అవసరం. ఇష్టదైవాన్ని పూజించండి.
మిథునం
తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. సమాజంలో మంచిస్థితిలో ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. తద్వారా పనులు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలు చేస్తారు. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. అయితే సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు స్థానచలన సూచన ఉంది. ఖర్చుల నియంత్రణ పాటించడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. రుణ బాధలు కొంత వరకు తొలగిపోతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
కన్య
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శివారాధనతో మేలు జరుగుతుంది.
ధనుస్సు
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంయమనం పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కుంభం
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మీనం
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రామాలయాన్ని దర్శించుకోండి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి, ఎమ్మెస్సీ, నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. 9885096295
nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

