మహారాష్ట్ర ప్రజలు క్షమించరు.. పవార్ పార్టీకి రౌత్ వార్నింగ్!
- ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలకు రూ.150 కోట్ల ఆఫర్?
- శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలు!
ముంబై: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) ఎంపీల నిర్ణయం మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో విభేదాలకు కారణమైంది. ఈ వ్యవహారంపై శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకడం మహారాష్ట్రకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు.ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించబోరని హెచ్చరించా రు.
ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఎంవీఏ మద్దతుతోనే ఎన్నికయ్యారని గుర్తుచేశారు. కాంగ్రెస్, శివసేన నేతలు వారి విజయానికి సహకరించారని అన్నారు. ఇప్పుడు మిత్రపక్షాలను సంప్రదించకుండా కేంద్రానికి మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నికల్లో అనుకూలంగా ఓటువేసే ఎంపీలకు రూ.150 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించా రు. డీలిమిటేషన్‌పై మహారాష్ట్రలోనిరసనలు చేపడతామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

