Defector MLAs | నమ్మి నాబోస్తే పుచ్చ బుర్రలయినట్లు తయారైంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. సొంత లాభాల కోసం, పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి.. ఇప్పుడు కనీస గౌరవం దక్కకకపోడంతో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. రాజేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత పెత్తనం చెలాయిస్తున్నాడని, భూ దందాలు చేస్తున్నాడని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంచెమైనా గౌరవం దక్కేదని, ఇప్పుడు కనీస మర్యాద కూడా దక్కడంలేదని చేవెళ్ల ఎమ్మెల్యమే కాలె యాదయ్య తన ఆవేదనను వెళ్లగక్కుతున్నాడు. పార్టీలో చేరేందుకు తనకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనకు కీలక పదవి ఇస్తే బాగుంటుందని చెబుతున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనునాయిలతో చెప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, బయటికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారని వారి అనుచరులే బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం.
కుడితిలో పడ్డ ఎలుకలలా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి
సొంత లాభాల కోసం, పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి.. ఇప్పుడు కనీస గౌరవం దక్కక అసంతృప్తితో ఉన్న అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య
రాజేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక… pic.twitter.com/GwnyWU6CvC
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026