RS Praveen Kumar | ప్రతిభా పాటవాల మీద స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ను దళితుడు, దళితుడు అని పదే పదే చెప్పి ఆ స్పీకర్ను ఘోరంగా అవమానించారు. అది తెలంగాణ ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఈ అవమానం భరించలేక ఆయన ఏడ్చారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవ స్పీకర్ నేను నా ప్రతిబా పాటవాల మీద ఊళ్లలో ఉండే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ఎమ్మెల్యేగా ఎన్నికై, గతంలో మంత్రిగా పనిచేసి స్పీకర్ పదవిలోకి వస్తే నన్ను దళితుడు దళితుడు అని కుల్లబొడుస్తూ మానసికంగా హింసిస్తున్నారని గడ్డం ప్రసాద్ కుమార్ ఏడ్చారన్నారు. ఆ స్పీకర్ మాతృమూర్తిని ఎవరూ ఏం అనలేదు. దివంగత స్పీకర్ సతీమణి గురించి ఎవరూ మాట్లాడలేదు.. కానీ సీతక్క మళ్లీ మళ్లీ వారి దివంగత సతీమణి గురించి, వారి మాతృమూర్తి గురించి మాట్లాడి స్పీకర్ను ఇబ్బంది పెట్టారు.
మా శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ తాతా మధు) నా చెల్లెళ్లను, అక్కలను సభ ఎదురుగా అంటే రోడ్డుమీద హింసిస్తుంటే నేను కోపంతో ఒక మాట అన్నాను. నేను స్పీకర్ను ఏం అనలేదని చాలా క్లియర్గా చెప్పారు. పోలీసుల రిపోర్ట్ కూడా అదే చెబుతోంది. స్పీకర్ను ఎమ్మెల్సీ తాతా మధు తిట్టలేదనే పోలీస్ రిపోర్ట్ చెబుతోంది. ఆ పోలీసులు రేవంత్ రెడ్డి దగ్గరే పనిచేస్తున్నారు. అందుకే కదా గౌరవ న్యాయమూర్తి వారిని అరెస్ట్ చేయకుండా బెయిల్ మీద విడుదల చేశారన్నారు.
దళితుడు, దళితుడు, దళితుడు అని కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అవమానించిన తీరుకి స్పీకర్ గారు ఏడ్చారు
స్పీకర్ గారి మాతృమూర్తి గురించి, వారి భార్య గురించి ఎవరూ ఏమీ అనలేదు.. సీతక్క గారే మళ్లీ మళ్లీ వాళ్ల గురించి మాట్లాడి స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టింది
పోలీసులే చెప్పారు స్పీకర్ గారిని… pic.twitter.com/fF5nQBugoP
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ