– ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా నారాయణరావు
– శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే బొల్లం
కోదాడ, సెప్టెంబర్ 10 : ఆర్యవైశ్య సంఘ కోదాడ పట్టణ అధ్యక్షుడి ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పైడిమర్రి నారాయణరావు గెలుపు కాంగ్రెస్ పార్టీ ఓటమికి పునాది అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన మర్యాద పూర్వకంగా కోదాడలోని నారాయణరావు నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్యులు అధికార పార్టీ చేసిన ఒత్తిళ్లకు లొంగకుండా నారాయణరావును గెలిపించారని పేర్కొన్నారు. ఈ విజయం నియోజకవర్గంలో కొనసాగుతున్న అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అన్నారు. భవిష్యత్లో జరిగే ప్రతి ఎన్నికలోను ఇదే ఒరవడి కొనసాగుతుందన్నారు. ఆయన వెంట ఆర్యవైశ్య ప్రముఖులు, బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఉన్నారు.