పాట్నా: బీహార్‌లో విజిలెన్స్ అధికారులు చేపట్టిన సోదాల్లో(Vigilance Raids).. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతుల ఇంటి నుంచి కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో పాటు ఆభరణాలు, ప్రాపర్టీ పేపర్లు, ఖరీదైన వాచీలను కూడా సీజ్ చేశారు. పాట్నాలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌గా చేస్తున్న రవీంద్ర కుమార్ దివాకర్, దానాపూర్‌లో జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా చేస్తున్న ఆయన భార్య కుమారి స్వీటీ ఇండ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాట్నా, బెగుసురాయిలో ఉన్న వివిధ లొకేషన్లలో సోదాలు చేశారు. రికవరీ చేసిన క్యాష్‌ను లెక్కించేందుకు మెషిన్లు వాడారు.
విజిలెన్స్ శాఖ అధికారులు నగదు, జ్వలరీ, డాక్యుమెంట్లను వెరిఫై చేశారు. విలిజెన్స్ శాఖ డీఐజీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సాగింది. అయితే సమగ్రంగా దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే నగదు, జ్వలరీ వివరాలను వెల్లడించనున్నట్లు అధికారులు చెప్పారు. కోట్లు ఖరీదు చేసే వాచీలను గుర్తించినట్లు చెప్పారు. పాట్నా ఇంటి నుంచి 70 లక్షల నగదు, 6 లక్షలు ఖరీదు చేసే 48 వాచీలు, బెగుసరాయి నుంచి 9 లక్షల క్యాష్, బంగారం, సిల్వర్ ఆభరణాలను, భూ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. కోటి ఖరీదు చేసే రెండు ఫ్లాట్లను భార్యాభర్తల పేరు మీద రిజిస్టర్ చేశారు. భార్య పేరుపై కోటిన్నర ఖరీదైన మూడు ప్లాట్లను కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.