నగోయా: భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ బృందం చరిత్ర సృష్టించింది. అత్యుద్భుత పర్ఫార్మెన్స్తో చైనాను ఓడించి.. ఏషియన్ గేమ్స్‌లో భారత బృందం స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. బుధవారం జరిగిన ఫైనల్లో.. భారత మహిళా ఆర్చరీ జట్టు వరల్డ్ రికార్డు స్కోరును సమం చేసింది. చైనాపై 236-234 స్కోరుతో ఇండియన్ టీమ్ విజయాన్ని నమోదు చేసింది. భారత బృందంలో ఆర్చరీలు జ్యోతి సురేఖా వెన్నం, చికిత తానిపర్తి, ప్రీతికా ప్రదీప్ ఉన్నారు. ఈ ముగ్గురు అసాధారణ ప్రతిభను చాటారు. దక్షిణ కొరియా పేరిట ఉన్న వరల్డ్ రికార్డు స్కోరును భారత బృందం సమం చేయడం గమనార్హం. 2014 ఇంచియాన్ ఏషియన్ గేమ్స్ సమయంలో కొరియా ఆ రికార్డు స్థాపించింది. చైనా బృందంలో వునైర్, వూ వాంగ్, ఫ్యాంగ్యో వెయి ఉన్నారు. ఈ ఈవెంట్లో చైనీస్ తైపయిపై నెగ్గిన కొరియా జట్టుకు కాంస్య పతకం దక్కింది.
ఫైనల్లోని ఏ-గేమ్‌లో ముగ్గురు ఆర్చర్లు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఓపెనింగ్ గేమ్‌లో 60-58 స్కోరు చేశారు. ఆ గేమ్‌లో అందరూ పర్ఫెక్ట్ 10 పాయింట్లు కొట్టారు. ఇక సెకండ్ రౌండ్లోనూ ఇండియా డామినేట్ చేసింది. సెకండ్లోనూ 60-58 పాయింట్లు స్కోరు చేశారు. దీంతో లీడింగ్ 178-176కు చేరింది. అయితే చైనా కాస్త వత్తిడికి లోనయ్యి, రెండు సార్లు 9 పాయింట్లు మాత్రమే రాబట్టింది.మూడో రౌండ్లో కూడా ఇండియా బెటర్ గేమ్ ఆడింది. మొత్తం ఆరు సార్లు పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించి టైటిల్‌ను చేజిక్కించుకున్నది.
తాజా ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు ఇది ఏడో స్వర్ణ పతకం. ఫైనల్లో ప్రవేశించేందుకు ఇండియా 234-233 స్కోరుతో కొరియాపై విజయం సాధించింది. 2023లో హంగ్జూలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లోనూ భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ బృందం స్వర్ణ పతకం గెలుచుకున్నది.
A beautiful way to start of this Day with Gold 🥇 in compound archery😍
Jyothi might not be able to win in individual medals in this edition but helped 🇮🇳n women’s team to deliver Gold🥇after beating 🇨🇳 at the finals by 238-234🙌
Congratulations to Chikitha & Prithika as well👏 https://t.co/z6XC2S1GAs pic.twitter.com/9wKSswhUKN— Amit Kumar De (@AmitK98infinite) September 30, 2026