Debut Wicket : అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచిన క్రికెటర్లు చాలామందే. శతకాలతో రెచ్చిపోయిన బ్యాటర్లు.. సంచలన బౌలింగ్‌తో ఔరా అనిపించిన బౌలర్లను చూశాం. అయితే.. తొలి మ్యాచ్‌లోనే ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లను ఔట్ చేసిన పేసర్లు కొందరే. అందులోనూ అత్యధిక పరుగుల వీరుల్లో ఒకరిని ఔట్ చేసి చిరస్మరణీయ రికార్డు పట్టేశాడు పాకిస్థాన్ పేసర్ రజాఉల్లాహ్(Razaullah). ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జో రూట్(Joe Root)ను ఔట్ చేయడం ద్వారా మొట్టమొదటి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడతడు.
సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డుల దుమ్ముదులుపుతున్న జో రూట్‌కు పాకిస్థాన్ పేసర్ షాకిచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రజాఉల్లాహ్ ఫామ్‌లో ఉన్న రూట్‌ను బోల్తా కొట్టించాడు. క్రీజులో కుదరుకోవాలనుకున్న రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపి తొలి వికెట్ సాధించాడీ పేసర్. దాంతో.. మొదటి మ్యాచ్‌లోనే టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిని ఔట్ చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు రజాఉల్లాహ్. తద్వారా పదహారేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వికెట్ తీసిన న్యూజిలాండ్ పేసర్ ఆండీ మెక్కే(Andy McKay) సరసన నిలిచాడీ పాకిస్థానీ.
Pakistan’s Razaullah dismissed Joe Root for his maiden Test wicket yesterday, when England’s captain was on 14,216 career runs.
Only New Zealand’s Andy McKay has dismissed a batter with more runs for his debut wicket – Sachin Tendulkar on 14,366 in Nagpur in 2010 😯 pic.twitter.com/wbiqnDObYI
— Cricinfo (@cricinfo) September 10, 2026
2010లో నాగ్‌పూర్ టెస్టుతో అరంగేట్రం చేసిన మెక్కే.. అప్పటికే 14,366 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్న మాస్టర్ బ్లాస్టర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మేటి బౌలర్లు ఎందరో వచ్చినా.. వారు తమ మొట్టమొదటి మ్యాచ్‌లో మాత్రం అత్యధిక పరుగుల హీరోలను పెవిలియన్ చేర్చలేకపోయారు. పదహారేళ్ల తర్వాత.. పాకిస్థాన్ పేసర్ రజాఉల్లాహ్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం.. 14,216 రన్స్‌తో రెండో స్థానలో కొనసాగుతున్న రూట్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.