న్యూఢిల్లీ: లోక్‌సభలో ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ.. జంతర్ మంతర్‌లో నిరసన చేస్తున్న యువ విద్యార్థినితో జరిగిన సంభషణ గురించి వివరించారు. తాను ఒక విద్యార్థిని అని ఓ అమ్మాయి చెప్పిందని, అప్పుడు ఆమెను విద్యార్థి ఎవరెంటే ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇచ్చిందన్నారు. స్టూడెంట్ అంటే ఓపెన్ మైండ్ ఉండేవారని, ఓపెన్ హార్ట్ తో ఉంటారని, విద్యార్థికి ముందు నుంచి అన్నీ తెలియవని, కొత్తగా జ్ఞానం పొందిన తర్వాత పాత విషయాన్ని విద్యార్థి మరిచిపోతాడని, ఈ విశ్వం నిత్యం మారుతూ ఉంటుందని, చాలా డైనమిక్‌గా జరుగుతుందని, జ్ఞానం కూడా నిత్యం మారుతోందని, కానీ విద్యార్థి ఎప్పుడూ హుందాగా ఉండాలని ఆమె చెప్పినట్లు రాహుల్ సభలో పేర్కొన్నారు. అయితే విద్యార్థుల్లో మరో రకమైన వారు ఉంటారని, కానీ వాళ్లు విద్యార్థులు కారు అని, కానీ వాళ్లు మాత్రం అన్నీ తెలిసినట్లు వ్యవహరిస్తుంటారని రాహుల్ అన్నారు. అన్నీ తెలుసని భావిస్తున్నారు, ఈ విశ్వం స్థిరమైందని అనుకుంటారని, తమ నుంచే జ్ఞానం ప్రవహిస్తుందని భావిస్తారని, వాళ్లు దురహంకారులు అని, ఎవర్నీ వినిపించుకోరు అని, ఇతర ప్రజల నిజాన్ని గౌరవించలేరని, వాళ్లను తాను ఇడియట్స్ అని పిలుస్తానని ఆ విద్యార్థిని చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Who is Andh Bhakt?
Ask Rahul Gandhi 🔥 #RahulGandhi #Loksabha #Parliament #dharmendrapradhan#JantarMantar #BJP #AndhBhakt pic.twitter.com/7bu8Gmb8hI
— Mohd Abdul Sattar (@SattarFarooqui) July 29, 2026
మూడు కేటగిరీల్లో విద్యార్థులు ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. స్టూడెంట్స్, ఇడియట్స్, అంధభక్తులు ఉంటారన్నారు. అయితే అంధభక్తుల ఇడియట్లను ఫాలోఅవుతుంటారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇడియట్ వ్యక్తిని దేవుడిగా భావించేవాడు అంధభక్తుడు అవుతాడని రాహుల్ అన్నారు. రాహుల్ గాందీ తన ప్రసంగంలో విద్యా వ్యవస్థను తప్పుపట్టారు. విద్యా వ్యవస్థ చాలా ఖరీదుగా మారిందన్నారు. కమర్షియలైజ్ అయ్యిందన్నారు. తమకు నచ్చిన విద్యను అందుకోలేకపోతున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. విద్యాశాఖను ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందన్నారు. విద్యా వ్యవస్థ క్రూరంగా తయారైందని, ప్రైవేటీకరణ విస్తృతంగా జరుగుతోందని, విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల నిజమైన శత్రువు ఆర్ఎస్ఎస్ అన్నారు.
జంతర్ మంతర్‌లో జరిగిన ప్రదర్శనను రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. విద్యార్థులది ఆగ్రహం, హింస, ద్వేషం కాదు అని, దేశ యువత చాలా లోతైన భావాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.ఈ దేశ భవిష్యత్తుకు సరైన సందేశం వినిపించారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని గౌరవించాలన్నారు. జరిగిన దాని పట్ల గర్వంగా ఫీలవ్వాలన్నారు.