KTR : బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో ఎంపీగా పోటీచేశాడని, అతడిపై అనర్హత వేటు వేయడానికి అంతకంటే సాక్ష్యం ఏంకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సన్మానం చేయాలని ఆయన ఎద్దేవా చేశారు.
అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు రాహుల్ గాంధీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు తాము సన్మానం చేద్దాం అనుకుంటున్నామని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ చేస్తున్న బహిరంగ దాడి ఇదని వ్యాఖ్యానించారు. రాజ్యంగం పట్టుకుని తిరిగే రాహుల్‌గాంధీకి సిగ్గు, లజ్జ ఉంటే పార్టీ ఫిరాయింపులపై సమాధానం చెప్పాలి. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టిచంపాలని ప్రశ్నించారు.