Ujjaini Mahakali Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై జోగిని(Jogini)లు ఆందోళనకు దిగారు. ఆషాఢ మాసం ఆదివారం అమ్మవారికి పరమపవిత్రమైన బోనం తెస్తున్న జోగినిలను పోలీసులు తోసేశారని వారు మండిపడ్డారు.
బోనాల ఉత్సవాల్లో నెత్తిన బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి వచ్చిన జోగినిల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జోగినిలు మీడియాకు తెలిపారు. పోలీసుల ప్రవర్తనతో బోనం కింద పడిందని కన్నీరు పెట్టుకుంది ఓ జోగిని. బోనాల వేడుకల్లో ప్రభుత్వం కేవలం వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తోందని, బోనాల ఉత్సవ కమిటీలోకి తమను ఎందుకు చేర్చడం లేదని జోగినిలు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తే, ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదని శివసత్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ బోనాల్లో ప్రభుత్వ, పోలీసుల తీరుపై జోగినిల ఆందోళన
అమ్మవారికి బోనం తెస్తున్న జోగినిలను తోసేసిన పోలీసులు
పోలీసుల ప్రవర్తనతో బోనం కింద పడిందని కన్నీరు పెట్టుకున్న జోగిని
ప్రభుత్వం కేవలం వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తుందని, బోనాల ఉత్సవ కమిటీలోకి తమను ఎందుకు చేర్చడం లేదని… pic.twitter.com/vTmjbDleHp
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2026