Commonwealth Games ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆఖరి రోజు భారత అథ్లెట్లు (Indian Athletes) నిరాశపరిచారు. జుడోలో ఆశలు రేపిన ఇష్రూప్ నారంగ్, పారా సైక్లిస్త్ లిషా దాస్‌లు విఫలమవ్వగా, ఒక్క పతకం రాలేదు. దాంతో, ఈసారైనా నలభైకి పైగా మెడల్స్ సాధించాలనుకున్న భారత బృందం కల నిజమవ్వలేదు. పదోరోజు బాక్సర్లు ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు.. జుడోలో ఉన్నాటి శర్మ గెలిచిన కాంస్యంతోనే టోర్నీని ముగించింది టీమిండియా. 126 మంది బృందంతో వెళ్లినప్పటికీ.. చివరకు 39 పతకాలతో సగర్వంగానే స్వదేశానికి రానుంది
గ్లాస్గో ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆఖరిరోజు మరిన్ని పతకాలు వస్తాయనుకుంటే నిరాశే మిగిలింది. పదోరోజు గెలిచిన మెడల్స్‌తోనే సరిపెట్టుకున్న టీమిండియా.. 39 పతకాలతో తిరిగి స్వదేశం రానుంది. బాక్సర్లు, వెయిట్‌లిఫ్టర్ల పుణ్యమాని 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు వచ్చాయి. ఆశించిన స్థాయిలో మెడల్స్ రాకున్నా ఈసారి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది భారత్. 57 కిలోల బాక్సింగ్‌లో పసిడి కొల్లగొట్టిన జాస్మినే లంబోరియా(Jasmine Lamboria) ముగింపు వేడుకల్లో భారత జాతీయ పతాకాన్ని చేబూని ముందు నడువనుంది.
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐜𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐆𝐥𝐚𝐬𝐠𝐨𝐰 𝟐𝟎𝟐𝟔 𝐂𝐨𝐦𝐦𝐨𝐧𝐰𝐞𝐚𝐥𝐭𝐡 𝐆𝐚𝐦𝐞𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐭𝐨 𝐚 𝐜𝐥𝐨𝐬𝐞.
🏆 Total Medal Tally | 🎖️39 Medals
🥇 13 Gold
🥈 17 Silver
🥉 09 Bronze #CWG2026 #TeamIndia #CommonwealthGames… pic.twitter.com/3m4x7bEYon— All India Radio News (@airnewsalerts) August 2, 2026
1. స్వర్ణం : మీరాబాయి చాను(వెయిట్‌లిఫ్టర్, 48 కిలోలు), ప్రీతి పవార్(బాక్సర్, 54 కిలోలు), జాస్మినే లంబోరియా(బాక్సర్, 57 కిలోలు), సాక్షి చౌదరి(బాక్సర్, 51 కిలోలు), ప్రియా ఘంఘాస్(బాక్సర్, మహిళల 60 కిలోలు), సచిన్ సివాగె(బాక్సర్, 60 కిలోలు) అస్మితా దే(జుడో), హర్ష్ సింగ్(జుడో), సోమన్ రానా(పారా షాట్‌పుట్), షర్మిలా ధన్కర్(పారా షాట్‌పుట్), దిలిప్ గవిట్(పారా అథ్లెటిక్స్). అరుంధతి చౌదరీ(బాక్సర్ 70 కిలోలు), అంకుశ్ పంగాల్(బాక్సర్, 80 కిలోలు)
2. రజతం: నీరజ్ చోప్రా(జావెలిన్ త్రో), జుడుమని సింగ్(బాక్సింగ్, 55 కిలోలు), మొహమ్మద్ బసిల్(పారా అథ్లెటిక్స్), సర్వేశ్ కుషారే(హై జంప్), గుల్వీర్ సింగ్(మారథాన్ పరుగు), ప్రవీణ్ చిత్రవేల్(ట్రిపుల్ జంప్), నరేంద్ర బెర్వాల్(బాక్సర్, 90ప్లస్ కిలోలు), లొవ్లీనా బొర్గొహైన్(బాక్సర్, 75 కిలోలు) శుభమ్ జులియా(పారా షాట్‌పుట్),
3. కాంస్యం: గుల్వీర్ సింగ్(అథ్లెటిక్స్), యశ్వీర్ సింగ్(జావెలిన్ త్రో), సిల్పా శ్యాల(పారా అథ్లెట్) లవ్లీనా బొర్గోహైన్( బాక్సర్, 75 కిలోలు), ఉన్నాటి శర్మ(జుడో), సెల్వ ప్రభు తిరుమరన్(ట్రిపుల్ జంప్), తేజస్విన్ శంకర్(డెకథ్లాన్)