Sheikh Hasina | రెండేళ్ల అజ్ఞాతం వీడనున్న హసీనా.. ఆగస్టు 5న ఏం చెబుతారామె..!
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు రెండేళ్ల తర్వాత అజ్ఞాతం వీడబోతున్నారు. ప్రాణభయంతో భారత్‌ను శరణుకోరిన ఆమె ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పనున్నారు.
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు రెండేళ్ల తర్వాత అజ్ఞాతం వీడబోతున్నారు. స్వదేశంలో అల్లర్ల కారణంగా పదవి కోల్పోయి ప్రాణభయంతో భారత్‌ను శరణుకోరిన ఆమె ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పనున్నారు. ఢిల్లీలో ఆగస్టు 5వ తేదీ బుధవారం హసీనా వర్చువల్‌గా మాట్లాడనున్నారు. డిసెంబర్లో తిరిగి సొంతగడ్డకు వెళ్లాలని అనుకుంటున్నా అని ఇదివరకే ప్రకటించిన మాజీ ప్రధాని తన రాజకీయ, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలు పంచుకునే అవకాశముంది.
అవామీ లీగ్ అధినేత్రిగా 16 ఏళ్లు బంగ్లాదేశ్ ప్రధాని పదవిలో కొనసాగిన షేక్ హసీనాకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. పైగా అవామీ లీగ్ పార్టీపై నిషేధంతో పాటు హసీనా పాస్‌పోర్టు రద్దు చేసింది ప్రభుత్వం. దాంతో, తిరిగి స్వదేశం వెళ్లాలనుకుంటున్న ఆమెకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో డిసెంబర్లో స్వదేశం వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా తొలిసారి వర్చువల్‌గా మాట్లాడబోతున్నారు.
#Breaking – Sheikh Hasina, former Bangladesh PM, to address virtually next week: pic.twitter.com/bZKBXvmSns
— NEWS WALA (@NEWSWALApy) August 2, 2026
సాయంత్రం 6 నుంచి
సొంతగడ్డకు వెళ్తానంటున్న ఆమెను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని, అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తామని న్యాయశాఖ మంత్రి ఎం అసాదుజ్జమన్(M Asaduzzaman) హెచ్చరికలకు వెరవని హసీనా తన కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని దక్షిణ ఆసియాకు చెందిన ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ సాయంతో ఆగస్టు 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30గంటల వరకూ ఆమె వర్చువల్‌గా మాట్లాడుతారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే తేదీన విద్యార్థుల అర్లర్ల కారణంగా ప్రధాని పదవి కోల్పోయారు హసీనా. దాంతో, ఆమె ఏం చెబుతారు? ఉరి శిక్షపై అప్పీల్ చేస్తానంటారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. భారత్‌లో తలదాచుకున్న ఆమె ఇప్పటివరకూ మీడియా ముందుకు రాలేదు.
Sheikh Hasina is set to make her first public appearance in India since being ousted from power in 2024. Speaking at a virtual event in New Delhi on August 5, Hasina is expected to discuss her political roadmap and proposed return to Bangladesh.@avarakai @theAshleyMolly pic.twitter.com/rqJrDlLEOB
— AA Faisal (@AA00Faisal) August 2, 2026
సో.. ఆగస్టు 5న హసీనా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అని యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది. ఎఫ్‌సీసీ దక్షిణాసియా అధ్యక్షుడు డాక్టర్ వాఎల్ అవ్వాద్ ఆధ్యర్యంలో ఈ వర్చువల్ ప్రోగ్రామ్ జరుగనుంది. హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, బంగ్లాదేశ్ మాజీ విద్యా శాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరీ, బంగ్లాదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి ముహమ్మద్ అలీ సిద్దిఖీ, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, మాజీ క్రికెటర్ షకీబుల్ హసన్ పాల్గొననున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

