Ram Pothineni | అభిమాని పరిస్థితి చూసి చలించిపోయిన రామ్.. చికిత్స బాధ్యత తీసుకుని మానవత్వం చాటుకున్న హీరో
Ram Pothineni | హీరో రామ్ పోతినేనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలైన ప్రతిసారీ అభిమానులు చూపించే ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఓ అభిమాని మాత్రం రామ్‌పై చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.
Ram Pothineni | హీరో రామ్ పోతినేనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలైన ప్రతిసారీ అభిమానులు చూపించే ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఓ అభిమాని మాత్రం రామ్‌పై చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆ యువతి.. తనకు ఇష్టమైన హీరో పాటలు, వీడియోలు చూస్తేనే ఆహారం తీసుకునే పరిస్థితిలో ఉంది. ఈ విషయం రామ్ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు. ఆ కుటుంబానికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతులకు శశి భవ్యత అనే 18 ఏళ్ల కుమార్తె ఉంది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఆమె పరిస్థితి రోజురోజుకూ విషమించింది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో తరచూ ఫిట్స్ రావడంతో పాటు శారీరక, మానసిక పరిస్థితి బాగా దెబ్బతింది.
ప్రస్తుతం ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైంది. కనీసం తన చుట్టూ ఉన్నవారిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నప్పటికీ.. రామ్ పోతినేని పేరు మాత్రం ఆమెపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శశి భవ్యతకు రామ్ అంటే ఎంతటి అభిమానం ఉందంటే.. ఆమెకు ఆహారం అందించడానికి కూడా హీరోకు సంబంధించిన వీడియోలు, పాటలను చూపించాల్సిన పరిస్థితి ఉంది. రామ్ ఫొటోలు లేదా వీడియోలు కనిపించినప్పుడు ఆమె ముఖంలో మార్పు కనిపిస్తుందని తల్లి చెబుతున్నారు.ఇలాంటి దృశ్యాలతో కూడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం రామ్ వరకు చేరింది. తనను ఇంతగా అభిమానించే యువతి ఇలాంటి పరిస్థితిలో ఉందని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు.
విషయం తెలుసుకున్న వెంటనే రామ్ పోతినేని శశి భవ్యత కుటుంబంతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చికిత్స విషయంలో కుటుంబం ఒంటరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆమెకు అవసరమైన వైద్య ఖర్చులతో పాటు మందుల కోసం కూడా తాను సహాయం చేస్తానని రామ్ హామీ ఇచ్చారు. అభిమాని పట్ల తన బాధ్యతగా భావించి ఆమె కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.చాలామంది ప్రముఖులు సాయం చేస్తామని ప్రకటించి ఆ తర్వాత మౌనంగా ఉండిపోయే సందర్భాలు కనిపిస్తుంటాయి. కానీ రామ్ మాత్రం అలా చేయలేదు. ఇచ్చిన మాటను అమలు చేసే దిశగా వెంటనే చర్యలు తీసుకున్నారు.శశి భవ్యతకు అవసరమైన మందులు, పౌష్టికాహారానికి సంబంధించిన సామగ్రిని ఆమె కుటుంబానికి పంపించారు. అంతేకాదు.. తనపై అంతులేని అభిమానం చూపిస్తున్న ఆమె కోసం తన వ్యక్తిగత వస్తువుల్లో ఒకటైన కళ్లద్దాలను కూడా బహుమతిగా పంపడం విశేషంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

