క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు.. బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది.. మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది.. కానీ క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు” అంటూ సాగునీటి శాఖ పనితీరుపై సెటైర్ వేశారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది.. కానీ క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు” అంటూ సాగునీటి శాఖ పనితీరుపై సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, అందుకే తాము ఆ పని చేయబోమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“సబ్జెక్ట్ నేను ప్రిపేర్ అయి సభకు రాలేదు. సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లు నేను మాట్లాడుతాను. బ్యాంకు చెక్కులు అంటే అర్థం అవుతుంది.. క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు” అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను ఆర్మీలో పనిచేసినందున డిసిప్లిన్ గురించి తెలుసునని పేర్కొన్న పల్లా.. ముఖ్యమంత్రి బూతుల ప్రభావం ఎక్కువైందంటూ సెటైర్ వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరు వస్తుందని, కేసీఆర్‌కు పేరు వచ్చే పనులు తాము చేయబోమని పల్లా వ్యాఖ్యానించారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీని కూడా తాము బాగు చేయబోమంటూ వ్యంగ్యంగా అన్నారు.
తమ్మిడిహట్టి ప్రాజెక్టును 2004లోనే నిర్మించాలని అనుకున్నామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. దశాబ్దం ఆలస్యమైన తమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మిస్తామని పేర్కొన్నారు.
KRMB, GRMB సమావేశాల్లో సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానని పల్లా వ్యంగ్యంగా అన్నారు. CWC సమావేశాన్ని కాంగ్రెస్ సమావేశంగా భావించానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణమని పల్లా పేర్కొన్నారు. “చంద్రబాబు నాయుడు రుణం మేము తీర్చుకోవద్దా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
కర్ణాటకలో 40 శాతం కమిషన్ తీసుకుంటే.. తెలంగాణలో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నామని, అందులో తప్పేముందని పల్లా సెటైర్ వేశారు. కాంగ్రెస్ అంటేనే ఫ్యామిలీలా కూటమి అని వ్యాఖ్యానించారు. చివరగా “మాకు సోనియా గాంధీ సర్టిఫికెట్ ఉంటే చాలు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

