AP News | విశాఖపట్నంలో తగులబడ్డ ఆర్టీసీ బస్సు.. బస్సులో జనంలేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం..!
AP News | విశాఖపట్నంలోని వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
AP News : విశాఖపట్నంలోని వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి నెల్లూరు నుంచి ప్రయాణికులతో వచ్చిన ఈ బస్సును వాల్తేరు డిపో వద్ద నిలిపి ఉంచారు.
అయితే శనివారం తెల్లవారుజామున బస్సు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదానికిగల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులు లేని సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ముప్పు తప్పినట్లయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

