న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్(Harish Rawat).. కాంగ్రెస్ పార్టీలో రెండు కీలక పదవులను వదులుకున్నారు. హరీశ్ రావత్ పీఏ చందన్ సింగ్ జీనా ఇంటి నుంచి ఈడీ అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆ ఘటనకు చెందిన అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా హరీశ్ రావత్ ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదువులకు ఆయన గుడ్‌బై చెప్పారు. తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలగరాదన్న ఉద్దేశంతో ఆ పదవుల నుంచి తప్పుకున్నట్లు రావత్ తెలిపారు. ఇష్టదైవాన్ని స్మరించించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వపరంగా ఎటువంటి పోస్టులో లేనని, కానీ పార్టీలో ఉన్న పదువుల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.
2016లో ఉత్తరాఖండ్ సబ్‌ఆర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన గ్రామపంచాయతీ వికాశ్ అధికారి పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకున్న మాజీసీఎం రావత్ పర్సనల్ అసిస్టెంట్ చందన్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టాడు. ఈడీ సోదాల్లో 32 లక్షల నగదు, బంగారం, లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. 2014 నుంచి 2017 మధ్య హరీశ్ రావత్ సీఎంగా ఉన్న సమయంలో చందన్ సింగ్ ఓఎస్డీగా పని చేశారు. మనీల్యాండరింగ్ చట్టం ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీన తనిఖీలు నిర్వహించారు. యూకేఎస్ఎస్ఎస్సీ చైర్మెన్, ఎగ్జామ్ కంట్రోలర్, ఓఎంఆర్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ఓనర్, మధ్యవర్తుల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఒకవేళ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎటువంటి అక్రమం జరిగినా, లేదా తనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నా, ఆ ఆధారాలను సీబీఐ, ఈడీకి ఇవ్వాలని రావత్ తెలిపారు. తెలిసి చేసినా, తెలియక చేసినా, శిక్షకు అర్హుడినని, ఉత్తరాఖండ్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు హరీశ్‌రావత్ పేర్కొన్నారు.
सामने टीवी पर खबर आ रही है कि देहरादून में हरीश रावत के पीए के पास भारी मात्रा में कैश और ज्वैलरी आदि पकड़ी गई या पकड़ाई गई, इस तथ्य का खुलासा तो आने वाले समय में होगा और यह सत्य है कि श्री जीना मेरे ओएसडी रहे हैं और मैं जितने भी पदों पर रहा, चाहे पार्टी में रहा या सरकार में रहा,… pic.twitter.com/Z6rZYcVev0
— Harish Rawat (@harishrawatcmuk) September 11, 2026